రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘అనుక్షణం’. ఈ సినిమాపై, కుమారుడు మంచు విష్ణు నటనపై ప్రసంశల వర్షం కురిపించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. సెప్టెంబర్ 13, శనివారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
‘అనుక్షణం’ సినిమాను చూశాను. పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచు విష్ణు అద్బుతమైన నటనను కనబరిచాడు. విష్ణు కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ‘అనుక్షణం’ సినిమా అని నా అభిప్రాయం. హాలీవుడ్ సినిమాల స్థాయిలో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. అతను దర్శకత్వం వహించిన సినిమాలలో ‘అనుక్షణం’ లాంటి ఇంటెన్స్ ఫిల్మ్ నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. 90 నిముషాల పాటు సినిమాలో సన్నివేశాలు టెన్షన్ క్రియేట్ చేశాయి. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు సినిమా చూసే ముందు జాగ్రత్తలు తీసుకోండి. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటుంది. ఇటువంటి సినిమాను ధైర్యంగా తెరకెక్కించిన వర్మ, విష్ణులకు నా అభినందనలు అని మోహన్ బాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
నవదీప్, తేజస్వి, మధుశాలిని, రేవతి, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా మలయాళంలో ‘కిల్లర్’గా విడుదలవుతుంది. మంచు విష్ణు ఈ సినిమాకు నిర్మాత.


