లెజండ్రీ నటుడు, తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు చివరిగా నటించిన సినిమా ‘మనం’. ఈ మూవీలో ఎఎన్ఆర్ తో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కూడా నటించారు. ఇలా మూడు తరాల హీరోలు కలిసి చేసిన మనం సినిమా మే 23న విడుదలై తెలుగు ప్రేక్షకులను అమితంగా మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం ఎఎన్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ వారు మనం 100 రోజుల వేడుకని చాలా గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే అదే వేడుకపై నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ ఆడియో రిలీజ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక లైలా కోసం ఆడియో విడుదలైనా ఇదివరకూ ఎలాంటి ఆడియో చేయలేదు. అలాగే అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ పరిచయ వేదికగా కూడా ఈ వేడుకని ఉపయోగించనున్నారని సమాచారం.
దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసి అక్కినేని అభిమానులను ఈ వేడుకకి ఆహ్వానించనున్నారు.


