
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ తన సినిమాలో ఏం చేసినా భారీగానే కనపడుతుంది. ఎక్కడా కాంప్రమైజ్ కనపడదు, క్వాలిటీ తగ్గదు. అలాంటి శంకర్ మొదటది సారి ఇండియాలోనే మొట్ట మొదటి సారిగా సుమారు 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ‘ఐ’. అలాంటి శంకర్ సినిమాని మాత్రమే కాకుండా ఆడియో లాంచ్ ని కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసి దానికోసం 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక ఈ రోజు సాయంత్రం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిధి అయిన హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ఇప్పటికే చెన్నై చేరుకున్నాడు. ఆర్నాల్డ్ తో పాటు ఈ వేడుకకి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య మొదలైన తమిళ హీరోస్ కూడా హాజరు కానున్నారు. ఇదంతా కాకుండా ఆడియో ఈవెంట్ ని పర్ఫెక్ట్ గా ఒప్లాన్ చేసారు. ఈవెంట్ ని మొదలు పెట్టిన రెండున్నర గంటల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
ఐ ఆడియో లాంచ్ లో 90 సెకన్ల ట్రైలర్ తో పాటు రెండు ప్రోమో సాంగ్స్ విజువల్స్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాని ‘ఐ’ పేరుతోనే రిలీజ్ చేయనున్నారు. విక్రమ్ – అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా పిసి శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

