
ఒక నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమా మీద ఉన్న ఫాషన్ తో నిర్మాతగా మారిన నటుడు బండ్ల గణేష్. ఆయన నిర్మాతగా మారిన తర్వాత బండ్ల గణేష్ అనడం కంటే బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ అంటేనే ఎక్కువగా గుర్తు పడుతున్నారు. బండ్ల గణేష్ తన నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న తన తదుపరి సినిమా ‘గోవిందుడు అందరివాడెలే’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా ఆడియో నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది.
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి అందరూ నిర్మాతలు బండ్ల గణేష్ ని స్పూర్తిగా తీసుకోవాలని అన్నాడు. ‘నాకు బి గణేష్ అనే నాకు తెలుసు కానీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ గణేష్ గా ఎదగడం చాలా ఆనందంగా ఉంది. తను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకునే టైం నుంచి ఇప్పటి వరకూ అదే ఒద్దిక, నడవడికతో ఉన్నాడు. అలాగే సినిమా బాగా రావడం కోసం ఏమన్నా చేయడానికి సిద్దపడే మనస్తత్వం. ఇప్పుడు వస్తున్న ప్రతి నిర్మాత బండ్ల గణేష్ ని స్పూర్తిగా తీసుకోవాలి. సినిమా చాలా భాగం అయ్యాక నటీనటులు సరిగా సెట్ అవ్వడం లేదు అనిపించాక వాళ్ళని మారుద్దాం అని అడిగితే ఏమాత్రం సంశయించాకుండా వాళ్ళని ఒప్పించి, పూర్తి పేమెంట్ ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టి తీసాడు. ఆ విషయంలో అతనికి హ్యాట్సాఫ్ చెప్పాలని’ చిరంజీవి అన్నాడు.
ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న ‘గోవిందుడు అందరివాడెలే’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది.

