‘పవనిజం’ సినిమా చూస్తానన్న పవన్ కళ్యాణ్ – దర్శకుడు

‘పవనిజం’ సినిమా చూస్తానన్న పవన్ కళ్యాణ్ – దర్శకుడు

Published on Sep 25, 2014 9:38 AM IST

pavan-with-director-e
పవన్ కళ్యాణ్ ని అమితంగా అభిమానించే ప్రేక్షకులు ఆ అభిమానానికి ఒక పేరు పెట్టారు. అదే ‘పవనిజం’. ఈ పేరుతో ఇ.కె.చైతన్య అనే అభిమాని ఒక సినిమా తెరకెక్కించారు. మధు, సుధీర్‌, జయంతి, ఇషా హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 26న విడుదలవుతుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. నాయకుడు అంటే ఎలా ఉండాలో మా సినిమాలో చూపించాం. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ భాద్యతతో మెలగాలి. పక్కవారికి సహాయం చేయాలి అనే భావనలు పవన్ కళ్యాణ్ ఆలోచనలలో వ్యక్తం అవుతూ ఉంటాయి. ఆయన ఆలోచనలను పాటిస్తే సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో మా సినిమాలో చూపించాం. ఇటివల పవన్ కళ్యాణ్ ను కలసి ‘పవనిజం’ సినిమా గురించి చెప్పారు. వీలు చూసుకుని పవన్ గారు సినిమాను చూస్తానని చెప్పారు. అని దర్శకుడు తెలిపారు.

పవన్ కళ్యాణ్ పేరుకు మచ్చ తీసుకురాకుండా మా సినిమా తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. ఇ.కె.చైతన్య అని తెలిపారు.

తాజా వార్తలు