మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రంపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేశాయి. షూటింగ్‌లో హీరో లుక్ సరిగా లేకపోవడంతో ఇప్పటికే చిత్రీకరించిన సీన్లను పక్కన పెట్టేశారని, అందుకే షూటింగ్ నిలిచిపోయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలపై నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చాయి.
నిర్మాణ సంస్థల సమాచారం ప్రకారం, షూటింగ్ నిలిచిపోయిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం జరుగుతున్న విరామం కేవలం నెక్స్ట్ షెడ్యూల్ కోసం జరుగుతున్న సాధారణ సన్నాహకమే తప్ప, సృజనాత్మక విభేదాల వల్ల కాదని వారు స్పష్టం చేశారు. ఈ అధికారిక ప్రకటనతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆందోళన చెందుతున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం షూటింగ్ సజావుగానే సాగుతున్నప్పటికీ, గతంలో అనుకున్న జూన్ 25 విడుదల తేదీకి సినిమా రావడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా చాలా భాగం చిత్రీకరణ బాకీ ఉండటం, ఎలాంటి ప్రోమోలు విడుదల కాకపోవడంతో విడుదల తేదీ మారే అవకాశం ఉంది. ‘డ్రాగన్’ గా పిలవబడుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిమల్ ఒబేరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come…
— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2026


