పర్ఫెక్షన్ కోసం పోటీ పడిన రామ్ చరణ్ – ప్రకాష్ రాజ్

పర్ఫెక్షన్ కోసం పోటీ పడిన రామ్ చరణ్ – ప్రకాష్ రాజ్

Published on Sep 29, 2014 11:39 AM IST

GAV
ఇప్పటివరకూ ఎక్కువగా యాక్షన్ ఎంటర్టైనర్స్ లో నటించిన మెప్పించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మొట్ట మొదటి పూర్తి కుటుంబకథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ విశేషాల గురించి కనుక్కున్నా మాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అదేమిటంటే డబ్బింగ్ సమయంలో ఎమోషనల్ సీన్స్ లో పర్ఫెక్షన్ ఏ మాత్రం మిస్ అవ్వకూడదని రామ్ చరణ్ – ప్రకాష్ రాజ్ పోటీపడి మరీ డబ్బింగ్ చెప్పారట.. ఈ సినిమా చివరి 30 నిమిషాలు బాగా ఎమోషనల్ గా ఉండడమే కాకుండా మూవీకి హైలైట్ గా నిలుస్తుందట, అందువలన ఆ సీన్స్ లో డబ్బింగ్ పరంగా చిన్న మిస్టేక్ వచ్చినా పెర్ఫెక్షన్ కోసం రామ్ చరణ్ – ప్రకాష్ రాజ్ మళ్ళీ మళ్ళీ పర్ఫెక్ట్ గా వచ్చే వరకూ డబ్బింగ్ చెప్పారట. ఇందులో భాగంగా కంటిన్యూగా రాత్రి 3 గంటల వరకూ కూడా డబ్బింగ్ చెప్పారట..

రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు. ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, జయసుధ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు