ప్రేమ ఒక్కసారే పుడుతుంది: పూజా హెగ్డేతో వరుణ్ ధావన్ బ్యూటిఫుల్ పోస్ట్.. ఫ్యాన్స్ ఫిదా!

ప్రేమ ఒక్కసారే పుడుతుంది: పూజా హెగ్డేతో వరుణ్ ధావన్ బ్యూటిఫుల్ పోస్ట్.. ఫ్యాన్స్ ఫిదా!

Published on Apr 7, 2026 4:59 PM IST

pooja and varun

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంట నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఓ బ్యూటిఫుల్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందమైన నది ఒడ్డున, ఇసుక తిన్నెలపై పూజాను తన ఒడిలో కూర్చోబెట్టుకుని వరుణ్ ఇచ్చిన ఫోజ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పిక్‌లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయిందని, బాలీవుడ్‌కి ఒక కొత్త క్యూట్ పెయిర్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫోటోను వరుణ్ ధావన్, పూజా హెగ్డే తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఉమ్మడిగా (Collab) షేర్ చేశారు. దీనికి “ఇష్క్ సిర్ఫ్ ఏక్ బార్ హోతా హై” (ప్రేమ ఒక్కసారే పుడుతుంది) అనే క్యాప్షన్ జత చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్ట్‌కు వేలల్లో లైక్స్, కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. హార్ట్ ఎమోజీలతో ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్‌ను నింపేస్తున్నారు. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఎందుకు సందడి చేస్తున్నారంటే.. వీరిద్దరు జంటగా నటిస్తున్న తాజా సినిమా అప్‌డేట్‌లో భాగమే ఈ పిక్.

వరుణ్, పూజా మెయిన్ లీడ్స్‌గా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ (Hai Jawani Toh Ishq Hona Hai) అనే ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రమోషన్స్‌లో భాగంగా వదిలిన ఈ ఒక్క ఫోటో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా పూజా హెగ్డే బాలీవుడ్‌లో ఈ సినిమాతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఈ ఫ్రెష్ పెయిర్ సిల్వర్ స్క్రీన్‌పై ఇంకెలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు