బండ్ల గణేష్ చేత కంటతడి పెట్టించిన కాంప్లిమెంట్.!

బండ్ల గణేష్ చేత కంటతడి పెట్టించిన కాంప్లిమెంట్.!

Published on Sep 29, 2014 12:35 PM IST

Bandla-Ganesh
ఇండస్ట్రీలో నటుడిగా ప్రారంభమై పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి బండ్ల గణేష్. ఆయన నిర్మాణ సంస్థ నుండి వస్తున్న కుటుంబ కథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు ఉదయం బండ్ల గణేష్ తన కుటుంబంతో కలిసి సినిమాని చూసారు. సినిమా పూర్తయ్యాక వాళ్ళ నాన్న ఇచ్చిన కాంప్లిమెంట్ తో నా కళ్ళు చెమర్చాయని బండ్ల గణేష్ అన్నాడు..

‘ఉదయమే సకుటుంబ సమేతంగా “గోవిందుడు అందరివాడేలే”చూసాం. ఈ సినిమా తీసినందుకు జీవితాంతం గర్వపడచ్చు అని నాన్న అంటున్నప్పుడు ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ఒక కళాఖండాన్ని, తెలుగు ఇళ్ళలో మావిడి తోరణం లాంటి సినిమా తీసిచ్చిన మా దర్శకుడు కృష్ణవంశీ కలకాలం పచ్చగా ఉండాలి! నాకు ఈ అవకాశం ఇచ్చిన లిటిల్ బాస్ రామ్ చరణ్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఆయువుపట్టు లాంటి పాత్రకు ప్రాణం పోసి సినిమాకి తలకట్టులా నిలబడిపోయిన ప్రకాశ్ అన్నయకి మా కృతజ్ఞతలు. మాకు అన్నయగా అండగా అన్నింటికీ పెద్ద దిక్కుగా తోడుగా నీడగా కోదండరాముడుగా వెన్నంటి నిలబడి నడిపించిన మెగాస్టార్ చిరంజీవి గారికి కృతఙ్ఞతలు. మామా సినిమాకి మూలాలనించి ముగింపు దాకా వెన్నుముకలా నిలబడ్డ పరుచూరివారికి ఎంతో రుణపడి ఉంటాం’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేసాడు.

తాజా వార్తలు