
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశి దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి వీలైనంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేది వరకు ప్రముఖ న్యూస్ ఛానళ్ళు అయిన టీవీ 9, ఐ న్యూస్, సాక్షి, టీవీ 5, వి 6, స్టూడియో యన్.. మొదలుకుని కొత్త ఛానళ్ళు కూడా గోవిందుడి నామస్మరణతో మొగిపొనున్నాయి. ప్రతి చానెల్ లో ‘గోవిందుడు..’ యాడ్స్ కోసం మినిమం 50 స్లాట్స్ ను బుక్ చేశారు. ప్రేక్షకులకు సినిమా చేరువ కావడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు నిర్మాత బండ్ల గణేష్.
సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడం కోసం రామ్ చరణ్, కృష్ణవంశిలతో పాటు ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎంతో కష్టపడ్డారు. వారందరికీ నా కృతజ్ఞతలు. సోమవారం ఉదయం సకుటుంబ సమేతంగా సినిమా చూశాం. ఈ సినిమా తీసినందుకు జీవితాంతం గర్వపడచ్చు అని నాన్న అంటున్నప్పుడు ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ఇలాంటి సినిమా చేసే అవకాశం, అదృష్టం నాకు కల్పించినందుకు చిరంజీవి, రామ్ చరణ్, ప్రకాష్ రాజ్, కృష్ణవంశిలకు జీవితాంతం రుణపడి ఉంటాను. అని నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన యువన్ శంకర్ రాజా సంగీతం అభిమానులను, శ్రోతలను అలరిస్తుంది.

