
టాలీవుడ్ యంగ్ హంక్ దగ్గుబాటి – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో గతంలో ‘నేను నా రాక్షసి’ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ మరో సినిమా కోసం సిద్దమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా పరంగా పూరి – రానాలు చేదు అనుభవం ఎదుర్కున్నప్పటికీ, వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. అందువల్లే వీరు మరోసారి సినిమా చేయడానికి సిద్దమయ్యారు. ప్రస్తుతం పూరి రానాకి కథ సిద్దం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఇది కాకుండా పూరి జగనాద్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

