‘గోపాల గోపాల’లో పవన్ కళ్యాణ్ లుక్ ఇదేనా..?

‘గోపాల గోపాల’లో పవన్ కళ్యాణ్ లుక్ ఇదేనా..?

Published on Sep 30, 2014 4:46 PM IST

Gopala-Gopala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ చిత్రంలో మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’లో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉంటుందో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హాల్ చల్ చేస్తుంది. మీరు పైన చూస్తున్నది ఆ ఫోటోనే.

‘గోపాల గోపాల’ షూటింగ్ గ్యాప్ లో పవన్ తో కలసి కొందరు అభిమానులు ఫోటో దిగారు. లేత గులాబీ రంగు షర్టు, పైన నల్ల కోటుతో పవన్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లుక్ ‘గోపాల గోపాల’లో ఇలానే ఉండొచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హిందీలో అక్షయ్ కుమార్ లుక్ కూడా కొంచం అటు ఇటుగా ఈ విధంగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

తాజా వార్తలు