
విలక్షణ మరియు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు రోజుల క్రితమే తన కొత్త సినిమా ‘సావిత్రి’ అని తనకు సంబందించిన టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసాడు. ఈ సినిమా కాన్సెప్ట్ టీనేజ్ లోని తమకు ఎదురైన తొలి యవ్వన అనుభూతుల ఆధారంగా తెరకెక్కించనున్నారు.
కానీ అది విడుదల చేసిన రెండవరోజే వర్మకి చిన్న సమస్య వచ్చి పడింది. ఈ టైటిల్ మరియు ఈ కాన్సెప్ట్ ని పబ్లిక్ ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయకపోవడం వలన రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా టైటిల్ ని ‘శ్రీదేవి’ గా మార్చాడు. అలాగే నిర్మాత అయిన నీలిమ తిరుమలశెట్టి ఇదే టైటిల్ ని తన సినిమాకి రిజిష్టర్ చేసానని తెలియజేయడం కూడా టైటిల్ మార్పుకు మరో కారణం.
ఈ శ్రీదేవి సినిమా కథా సహకారం కోసం వర్మ ప్రేక్షకులను తమ టీనేజ్ లో జరిగిన అనుభవాల గురించి వర్మ టీంకి పంపితే వాటిలో కొన్నిటిని సినిమాలో పెట్టుకుంటామని కూడా తెలియజేశాడు.

