
ఇప్పటి వరకూ విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ తో సినిమా చేసిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ప్రస్తుతం యువతలో క్రేజ్ ఉన్న యంగ్ హీరో ని తన తదుపరి సినిమా కోసం బుక్ చేసారు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు… అలా మొదలైంది సినిమాతో అందరినీ ఆకట్టుకున్న నాని.
నాని కూడా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడు. ఇది వరకే నాని – హను రాఘవాపూడి దర్శకత్వంలో ‘కవచం’ సినిమా ఉంటుందని అనుకున్నా అది క్యాన్సల్ అయ్యింది. దాంతో మరో కొత్త కథతో 14 రీల్స్ బ్యానర్ లో నాని – హను రాఘవాపూడి కలిసి సినిమా చేయనున్నారు.
ఇది కాకుండా నాని ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో నాగు దర్శకుడిగా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

