నాగార్జున సీక్వెల్ పై భారీ అంచనాలు.!

నాగార్జున సీక్వెల్ పై భారీ అంచనాలు.!

Published on Oct 5, 2014 8:09 PM IST

First-Look-Nagarjuna-in-Mee
కింగ్ అక్కినేని నాగార్జున చేయబోయే సీక్వెల్ పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయా.? అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. కానీ ఇది నాగార్జున నటించబోయే హిట్ సినిమా సీక్వెల్ కాదు.. నాగార్జున బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ షో సీక్వెల్..

చాల ఆరోజుల క్రితమే పూర్తయిన ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 1 కి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరి నుంచీ పోజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా బుల్లితెర టిఆర్పి రేటింగ్స్ ని షేక్ చేసింది. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడికి సీజన్ 2 ప్రారంభం కానుంది. ఈ సీజన్ పై ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి బుల్లితెర ప్రేక్షకుడికి భారే అంచనాలు నెలకొన్నాయి. మొదటి సీజన్ సక్సెస్ అవ్వడం వలన ఈ సీజన్ కి స్పాన్సర్స్ కూడా క్యూ కడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు