ఎన్.టి.ఆర్ సినిమాలో నోర ఫతేహి స్పెషల్ సాంగ్

ఎన్.టి.ఆర్ సినిమాలో నోర ఫతేహి స్పెషల్ సాంగ్

Published on Oct 6, 2014 2:47 PM IST

NTR_Nora-Fatehi
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇందులో ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఇది వరకూ ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో పూరి జగన్నాధ్ ఓ కెనడియన్ మోడల్ నోర ఫతేహిని రంగలోకి దించారు. నోర ఫతేహికి ఇదే తొలి తెలుగు సినిమా. పూరి ఇప్పటికే పలు మోడల్స్ ని తన సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయం చేసాడు. వారి లిస్టులో నోర ఫతేహి కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం హిందీలో ‘రోర్’ అనే సినిమాలో నటించింది. ఇది కాకుండా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ గర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉండడం వలన అనుకున్న టైంకి ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం కంటిన్యూగా షూటింగ్ చేస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు