
‘జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. కాని, బాధపడను. ఎందుకంటే ‘శివ’ అనే సినిమాలో నటించి, నిర్మించి ఒక కరెక్ట్ పని చేశాను’ అని అన్నారు కింగ్ నాగార్జున. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన ‘శివ’ సినిమా విడుదలై అక్టోబర్ 5కు 25 వసంతాలు పూర్తయిన నేపధ్యంలో ఏర్పాటు చేసిన వేడుక సభలో నాగార్జున పైవిధంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి ‘శివ’ సినిమాకు పని చేసిన నటులు, టెక్నీషియన్లు.. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల, ఎస్ గోపాల్ రెడ్డి, జెడి చక్రవర్తి, తనికెళ్ళ భరణి, కృష్ణవంశి, ఉత్తేజ్, శివ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
అనంతరం నాగార్జున మాట్లాడుతూ… నా జీవితాన్ని మార్చిన సినిమా శివ. జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. కాని, బాధపడను. ఎందుకంటే ‘శివ’ అనే సినిమాలో నటించి, నిర్మించి ఒక కరెక్ట్ పని చేశాను. ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను నవంబర్ నెలలో తిరిగి విడుదల చేస్తున్నాం. డిజిటల్ రీమాస్టర్ ప్రింట్ తో సుమారు 100 థియేటర్లలో ‘శివ’ సినిమాను ప్రదర్శిస్తాం అని నాగార్జున అన్నారు.

