
హాయ్, అంజు పెళ్లికి ముందు నాకు నవరసాలు అంటే ఏంటో తెలియదు. పెళ్లి తర్వాత అవేంటో నాకు చూపించావు. భయపెట్టావ్, నవ్వించావ్, ఏడిపించావ్.. ఇలా అన్ని రకాలు చూపించావు. నీకోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది. అక్టోబర్ 11న, ఒక్క రోజు నీకోసం ఉపవాసం ఉంటున్నాను. నీ మీద ప్రేమతో సగం, పెళ్లి తర్వాత అందరూ లావయ్యనని ఏడిపిస్తున్నారు. రెండూ కలిసొస్తాయని ఉపవాసం ఉంటున్నాను. మనస్పూర్తిగా అక్టోబర్ 11న నా స్వీట్ హార్ట్ కోసం ఫాస్టింగ్ ఉంటున్నాను. అంటూ యువ హీరో నాని ఒక వీడియో విడుదల చేశారు.
వైఫ్ కోసం ఒక్క రోజు ఉపవాసం ఉంటున్నాడు ఈ యంగ్ హీరో. అంతే కాదండోయ్… మీరు కూడా ఉపవాసం ఉండండి అని, ప్రముఖ దర్శకులు కృష్ణవంశి, రాజమౌళి, మోహన కృష్ణ ఇంద్రగంటిలకు ఛాలెంజ్ చేశాడు.
పెళ్ళైన తర్వాత మీ కోసం తన అభిరుచులను, అభిప్రాయాలను మీ భార్య మార్చుకుంటుంది. తన కుటుంబాన్ని వదలి వస్తుంది. మీ జీవితంలో అర్ధాంగి ఎంత ప్రత్యేకం అనే విషయం తెలియజేయడం కోసం ఒక్క రోజు కేటాయించండి. అక్టోబర్ 11న ఉపవాసం ఉండండి. #FastForHer అంటూ షాదీ డాట్ కాం మ్యారేజ్ బ్యూరో ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది.

