దీపావళికి పూరి – ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ లుక్..?

దీపావళికి పూరి – ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ లుక్..?

Published on Oct 8, 2014 3:57 PM IST

jr-ntr-puri-jaganath
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ శుభవార్త. జెట్ స్పీడులో సినిమాలను తీసే దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు నేనోరకం, టెంపర్ అనే టైటిల్స్ పెట్టినట్టు వార్తలు రాగా పూరి వాటిని ఖండించారు. దీపావళి పండుగ సందర్భంగా.. ఈ నెల 23న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ మూడోసారి నటిస్తున్న ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ 25% కంప్లీట్ అయ్యింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ హెట్ స్పీడుతో జరుగుతుంది. 2015 సంక్రాంతికి సినిమాను ఎట్టి పరిస్థితితులలోనైన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ఎన్టీఆర్, పూరి & టీం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు