
‘బంపర్ ఆఫర్’ తర్వాత మరోసారి తమ్ముడి సినిమా కథ, మాటలు అందించారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆ చిత్రమే ‘రోమియో’. పూరి రాసిన ప్రేమకథ అనేది ఉప శీర్షిక. సాయి రామ్ శంకర్, అడోనిక జంటగా పూరి శిష్యుడు గోపి గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేయడానికి మీడియాతో సమావేశం అయ్యారు హీరో సాయి రామ్ శంకర్. ఆ విశేషాలు మీకోసం..
ప్రశ్న) ‘రోమియో’ సినిమాపై మీకు ఏ విధమైన అంచనాలు ఉన్నాయి..?
స) నా కెరీర్ లో ‘బంపర్ ఆఫర్’ సినిమా పెద్ద హిట్. ఆ తర్వాత విడుదలైన సినిమాలు ఆశించిన రీతిలో విజయం సాధించాలేదు. ప్లాప్ అయ్యాయి. ‘బంపర్ ఆఫర్’ తర్వాత మరోసారి అన్నయ్య నా సినిమాకు కథ, మాటలు అందించారు. ‘రోమియో’ – పూరి రాసిన ఈ ప్రేమకథ నాకు మరో హిట్ అందిస్తుందని ఆశిస్తున్నాను. మంచి కథతో సినిమా రూపొందించాం.
ప్రశ్న) గోపి గణేష్ ను దర్శకుడిగా తీసుకోవడానికి కారణం..?
స) అన్నయ్య వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేసే సమయంలో గోపి గణేష్ యాక్టర్స్, అప్ కమింగ్ హీరోలకు షోరీల్స్ చేసేవాడు. స్టైలిష్ గా తీసేవాడు. అవి అన్నయ్యకు బాగా నచ్చాయి. ‘రోమియో’ వంటి కథను గణేష్ అయితే బాగా తెరకేక్కిస్తాడని అతన్ని దర్శకుడిగా ఎంచుకున్నాం.
ప్రశ్న) సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?
స) ‘ఇడియట్’ సినిమాలో రవితేజ క్యారెక్టర్ తరహాలో ఉండే పాత్రలో నేను కనిపిస్తాను. ‘రోమియో’లో అమ్మాయి వెంట పడి ప్రేమించమని ఏడిపించే క్యారెక్టర్ అనమాట. ప్రతి సన్నివేశం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. నాకు అన్నయ్యగా రవితేజ అతిధి పాత్రలో, మావయ్యగా అలీ నటించారు. రవితేజ తుఫాన్ లా వచ్చి వెళ్ళిపోతారు.
ప్రశ్న) రవితేజ చేత అతిధి పాత్ర చేయించడానికి కారణం..?
స) నాకు, సినిమాకు ప్లస్ అవుతుందని రవితేజ గారి చేత అతిధి పాత్రలో నటింపజేశాం. ఆయన నటించడం వలన సినిమాకి వేల్యూ పెరిగింది. సాధారణంగా స్టార్ హీరోలు గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకోరు, కొంచం సందేహిస్తారు. నేను అడగగానే కొన్ని సన్నివేశాలు అయినా నటించడానికి అంగీకరించిన రవితేజ గారికి థాంక్స్.
ప్రశ్న) హీరోయిన్ అడోనిక ఎలా నటించింది..?
స) యుఎస్ లో పుట్టి పెరిగిన తెలుగమ్మాయిగా అడోనిక నటించింది. ఆమె తల్లి పాత్రలో జయసుధ గారు నటించారు. కొత్త హీరోయిన్ అయినా చాలా బాగా నటించింది. యూరోప్ లో షూటింగ్ కి బయలుదేరడానికి ముందు 15 రోజుల పాటు ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించాం. సో, మా పని చాలా ఈజీ అయిపొయింది.
ప్రశ్న) సినిమాలో హైలైట్స్ ఏంటి..?
స) పూరి రాసిన ఈ ప్రేమకథ సరికొత్తగా ఉంటుంది. కథ, రవితేజ గెస్ట్ అప్పియరెన్స్, మెయిన్ లీడ్ పెర్ఫార్మన్స్ సినిమాకు హైలైట్ అవుతాయి. డిఫరెంట్ స్టొరీ.
ప్రశ్న) ‘రోమియో’ తర్వాత మీరు నటించబోయే సినిమాల గురించి చెప్పండి..?
స) తమిళ హీరో శరత్ కుమార్, నేను హీరోలుగా ఒక సినిమాలో నటిస్తున్నాం. ఇది కాకుండా ‘జగదాంబ’ అనే మరో సినిమా సెట్స్ పై ఉంది.
ప్రశ్న) పూరి జగన్నాధ్ దర్శకత్వంలో.. మళ్లీ మీరు ఎప్పుడు నటిస్తారు..?
స) రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత అన్నయ్య దగ్గరకి వెళ్లి నాతో సినిమా చేయమని అడిగితే బాగుంటుంది. ప్రస్తుతం నా బిజినెస్ రేంజ్ వేరు, అన్నయ్య బిజినెస్ రేంజ్ వేరు. ప్రస్తుతం మా ఇద్దరు కలసి సినిమా చేస్తే బ్యాలెన్స్ అవ్వదు నిజాయితిగా, ఎటువంటి దాపరికం లేకుండా మనసులో మాటను చెప్పారు.

