
సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ పురుషాధిక్యత లేదా హీరో డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ అంటూ ఉంటారు. ఇదే విషయాన్ని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు మరియు హీరోయిన్స్ కూడా ధ్రువీకరించారు. ఇలాంటి ఇండస్ట్రీలో హీరోకి సమానంగా పోటీపడి లేదా డామినేట్ చేసే పాత్రలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి పాత్రే ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాలో తనకు వచ్చినందుకు కార్తీక చాలా హ్యాపీగా ఫీలవుతోంది. అంతే కాకుండా ఆ క్రెడిట్ మొత్తం అల్లరి నరేష్ కే అని అంటోంది.
ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఫస్ట్ టైం చిన్ని కథ చెబుతున్నప్పుడు ఇతనేంటి హీరో పాత్రని తీసుకొచ్చి నాకు చెప్తున్నాడు అని షాక్ అయ్యాను. కానీ తర్వాత అది నా పాత్రే అని చెప్పాడు. చెప్పాలంటే బ్రదర్ అఫ్ బొమ్మాళికి నేనే హీరో. ఈ సినిమాలో అన్ని స్టంట్స్ నేనే చేస్తాను. హీరో డామినేటెడ్ ఇండస్ట్రీలో నాకు ఇలాంటి అవకాశం రావడం అంటే నేను చాలా లక్కీ.. ఈవిషయంలో అల్లరి నరేష్ కి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇంత ప్రాధాన్యత ఉన్నా తను ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఏకాంరేజ్ చేసాడు. అందుకే ఈ క్రెడిట్ మొత్తం అల్లరి నరేష్ కి చెందుతుందని’ తెలిపింది.

