డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. దీని తర్వాత పూరి చేయాల్సిన రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. అందులో జ్యోతి లక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా చేయనున్నాడు. అందులో జ్యోతి లక్ష్మిగా ముద్దుగుమ్మ ఛార్మీ కనిపించనుంది. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ ఈ జ్యోతి లక్ష్మి సినిమాని మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలా ఆధారంగా తీయనున్నట్లు తెలిపారు.
ఈ విషయంతో ఈ సినిమాపై ఇంకాస్త ఆసక్తి పెరిగింది. ఎందుకంటే పూరి జగన్నాధ్ ఇప్పటి వరకూ ఓ నవలా ఆధారంగా సినిమా తీయలేదు. మరి అలా తీస్తున్నాడు అంటే ఎలా ఉంటుందా.? అని అందరిలోనూ చిన్న ఉత్కంఠ మొదలైంది. ఇది కాకుండా పూరి సరికొత్త రైటర్స్ ని ఎంకరేజ్ చేసి తన బ్యానర్ లో సినిమాలు చెయ్యాలని ఇటీవలే అనౌన్స్ చేసారు. ఈ అనౌన్స్ మెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్.టి.ఆర్ సినిమాకి కూడా వక్కంతం వంశీ కథ అందించాడు. వేరే వారి కథతో పూరి సినిమా చేయడం కూడా ఇదే ప్రధమం.


