అభిమానులకు కిక్ ఇస్తున్న బాలయ్య న్యూ లుక్..!

అభిమానులకు కిక్ ఇస్తున్న బాలయ్య న్యూ లుక్..!

Published on Oct 13, 2014 2:25 PM IST

balakrishna
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో జరుగుతుంది. బాలకృష్ణ బైక్ చేజింగ్ సన్నివేశాలు, కార్ బ్లాస్టింగ్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఆ సమయంలో కొందరు అభిమానులు బాలయ్యతో ఫోటో దిగారు. అభిమాన హీరోతో కరచాలనం చేయడానికి పోటి పడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. బాలయ్య న్యూ లుక్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మణిశర్మ బాలకృష్ణ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు