
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకూ హీరోలుగా పరిచయం అయిన, హీరోలుగా పరిచయం కానున్న వారితో కలుపుకొని హీరోలతో కలుపుకొని సుమారు 8మంది హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు. ఈ 8 మంది హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఆ సమయంలో మెగా అభిమానుల అరుపులకి అంతం ఉంటుందా.? మీరు వింటున్నది నిజమే.. ఇలా అందరు మెగా హీరోలు కలిసి ఓ వేదికపైకి రానున్నారు..
అసలు విషయంలోకి వెళితే.. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 18న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరు హీరోలు హాజరు కానున్నారు. ఈ వార్తా వినగానే మెగా అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన హీరోయిన్ గా నటించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

