తుఫాన్ భాదితులకు మోహన్ బాబు చేయూత..!

తుఫాన్ భాదితులకు మోహన్ బాబు చేయూత..!

Published on Oct 13, 2014 9:38 PM IST

Mohan-Babu
తెలుగు మాట్లాడే ప్రజలందరికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు వంటివి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా నా మనసుకు చాలా భాదగా అనిపిస్తుంది. విశాఖ, ఉత్త్రారాంద్ర, తూర్పు గోదావరి మరియు పరిసర ప్రాంతాలలో ప్రజలు హుధూద్ తుఫాన్ ప్రభావంతో తీవ్ర కష్టాలు పడుతున్నారు. వారికి సహాయం చేయడానికి నేను మరియు నా పిల్లలు సన్నద్ధం అయ్యాం. అని అన్నారు ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత మంచు మోహన్ బాబు.

ఇంకా మోహన్ బాబు మాట్లాడుతూ…. ఇది మనసుకు కష్టతరమైన విషయం. సుమారు 38 మండలాలలో ప్రజలకు సరైన తాగునీరు లేదు, కరెంట్ లేకపోవడంతో అంధకారంలో ఉండిపోయారు. జరిగిన ఘోరం తలచుకుంటే మనసు తరుక్కుపోతుంది. నేను, నా పిల్లలు స్వయంగా సహాయక చర్యలలో పోల్గొనాలని నిర్ణయం తీసుకున్నాం. మా శక్తి మేరకు వీలైనంత మందికి సహాయం చేస్తాం. గతంలో కూడా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నేను, మా కుటుంబ సభ్యులు సహాయం చేసిన సంగతి తెలిసిందే. ఒకరికి మరొకరు సహాయపడడం మనిషిగా మన ధర్మం. ఇటువంటి సమయంలో మా చిన్నబ్బాయి మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాను కూడా విడుదల చేయడం సమంజసం కాదని భావించి, విడుదల వాయిదా వేశాం. అని మోహన్ బాబు తెలిపారు.

తాజా వార్తలు