సూర్య – హరి కాంబినేషన్ లో ఐదవ సినిమా..!

సూర్య – హరి కాంబినేషన్ లో ఐదవ సినిమా..!

Published on Oct 14, 2014 8:49 PM IST

Surya-Director-Hari
తమిళ స్టార్ హీరో సూర్య, మాస్ సినిమాల దర్శకుడు హరి కాంబినేషన్ లో ఐదవ సినిమా తెరకెక్కడానికి రంగం సిద్దమయింది. వీరిద్దరి కలయికలో రూపొందిన నాలుగు సినిమాలు ‘దేవా’, ‘ఆరు’, ‘సింగం’, ‘యముడు’ తెలుగులో కూడా విడుదలై మంచి విజయం సాదించాయి. ఈ ఐదవ సినిమాపై రెండు భాషల ప్రేక్షకులలో అంచనాలు నెలకొన్నాయి.

హరి దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘పూజ’ ఈ దీపావళికి విడుదలవుతుంది. విశాల్, శృతి హాసన్ ఈ సినిమాలో జంటగా నటించారు. ‘పూజ’ తర్వాత సూర్య సినిమా చేస్తున్నట్టు హరి ప్రకటించారు. ప్రస్తుతం సూర్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మాస్’ సినిమాలో నటిస్తున్నారు. ‘మాస్’ పూర్తయిన తర్వాత హరి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సూర్య కోసం హరి కొత్త కథ సిద్దం చేశారా..? లేదా సింగం సీక్వెల్ తీస్తున్నారా..? అనేది మరికొన్ని రోజులలో వెల్లడవుతుంది.

తాజా వార్తలు