గోపీచంద్ – యువి క్రియేషన్స్ మూవీ టైటిల్ ‘జిల్’.?

గోపీచంద్ – యువి క్రియేషన్స్ మూవీ టైటిల్ ‘జిల్’.?

Published on Oct 16, 2014 10:47 AM IST

gopichand
మాచో హీరో గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమా ఇటీవలే విడుదలై విజయం సాధించడం మరియు గోపీచంద్ తండ్రి అవ్వడం రెండూ వరుసగా జరిగిపోయాయి. దీంతో గోపీచంద్ చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. గోపీచంద్ నటిస్తున్న మరో సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి ఇదివరకే తెలియజేశాం. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా కోసం ‘జిల్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. కానీ ఈ జిల్ అనే టైటిల్ కి మరియు సినిమాకి పెర్ఫెక్ట్ గా సరిపోయే ఓ ట్యాగ్ లైన్ దొరికితే ‘జిల్’ అనే టైటిల్ ని ఖరారు చేయాలని లేదా వేరే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ చిత్ర టీం జిల్ అనే టైటిల్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాగే ప్రొడక్షన్ టీం ఈ సంవత్సరం చివరికల్లా షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2015 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.

గోపీచంద్ సరసన ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు