AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!

AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!

Published on Apr 6, 2026 8:00 PM IST

Allu Arjun, Atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్లతో పాటు, ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అత్యంత కీలకం కానున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్‌డేట్ రాబోతోంది.

ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు(ఏప్రిల్ 7) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, చిత్ర యూనిట్ రేపు అధికారికంగా టైటిల్‌ను ప్రకటించనుంది. అభిమానుల కోసం కేవలం టైటిల్ పోస్టర్ మాత్రమే కాకుండా, సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఒక చిన్న గ్లింప్స్ లేదా స్పెషల్ VFX వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న తదితరులు కనిపిస్తారని సమాచారం. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రాబోతున్న ఈ చిత్రం, 2027 మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు రాబోయే అప్‌డేట్‌తో ఈ సినిమాపై ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది.

తాజా వార్తలు