
పాపనాశనం (దృశ్యం రీమేక్) సినిమా షూటింగ్ లో కమల్ హాసన్ గాయపడినట్టు గురువారం సాయంత్రం వార్తలు వెలువడ్డాయి. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో కమల్ ముక్కుకు గాయమైందని, వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారనే వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. మీడియాకు కమల్ ఓ ప్రెస్ నోట్ పంపించారు.
పాపనాశనం షూటింగ్ లో గాయమైంది అనే వార్త అవాస్తవం. షూటింగ్ పూర్తయిన తర్వాత మేకప్ తొలగిస్తున్న సమయంలో ముక్కులో ఉంచిన రబ్బరు ఒకటి స్లిప్ అయ్యి లోపలికి వెళ్ళింది. అది తొలగించడం కోసం నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు వెళ్ళాను. మేకప్ అలా ఉండడంతో నన్ను చూసిన కొందరు తీవ్రంగా గాయపడ్డానని భావించారు. ఎండోస్కోపి ద్వారా వైద్యులు రబ్బరును తొలగించారు. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. అంటూ కమల్ హాసన్ ఒక ప్రెస్ నోట్ పంపారు.

