గోపాల గోపాల’తో స్టైలిస్ట్ గా మారిన వెంకటేష్

గోపాల గోపాల’తో స్టైలిస్ట్ గా మారిన వెంకటేష్

Published on Oct 26, 2014 10:42 PM IST

Venkatesh-(124)

టాలీవుడ్ టాప్ హీరోస్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్. బాలీవుడ్ లో పరేష్ రావాల్ పోషించిన పాత్రని వెంకటేష్ ఇందులో పోషిస్తున్నాడు. అందులో పరేష్ రావాల్ మిడిల్ క్లాస్ వ్యక్తిలా చాలా సింపుల్ గా కుర్తా, పైజామా, జాకెట్స్ తో కనిపిస్తారు. తెలుగులో మన నేటివిటీకి తగ్గట్టు ఉండాలని వెంకటేష్ స్పెషల్ కేర్ తీసుకున్నారు.

ఇన్ని రోజులు హీరోగానే మనకు పరిచయం ఉన్న వెంకటేష్ ‘గోపాల గోపాల’తో స్టైలిస్ట్ గా కూడా మారారు. అసలు విషయంలోకి వెళితే ‘గోపాల గోపాలలో వెంకటేష్ పోషిస్తున్న మిడిల్ క్లాస్ పాత్రకి ఆయనే దగ్గరుండి తన కాస్ట్యూమ్స్ ని సెలక్ట్ చేసుకున్నారు. అందులో భాగంగా షార్ట్ కుర్తాస్ ని సెలెక్ట్ చేసుకోవడం అవి కూడా ఎక్కువ భాగం లెనిన్, కాటన్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అంతే కాకుండా వెంకటేష్ స్వయంగా షాపింగ్ కి వెళ్లి మరి తన డ్రెస్ లను కొనుగోలు చేసారు. సినిమాలోని అన్ని పార్ట్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కలర్స్ ని కూడా ఆయనే సెలక్ట్ చేసారు. ఈ కాస్ట్యూమ్స్ లో వెంకీ చాలా స్టైలిష్ అండ్ క్లాస్ గా కనపడతారని’ ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

వెంకటేష్ సరసన శ్రియ శరన్ నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు