
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వరుసగా తను కమిట్ అయిన సినిమాల షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే విశ్వరూపం 2 ఫినిష్ అయ్యింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఉత్తమ విలన్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలా ఉంటే కమల్ హాసన్ అప్పుడే మరో సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసారు.
అసలు విషయంలోకి వెళితే.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాని కమల్ హాసన్ తమిళంలో ‘పాపనాశం’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలైంది కానీ అప్పుడే కమల్ ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసారు. కమల్ హాసన్ 39 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసారు. ఇక ఏమన్నా ప్యాచ్ వర్క్ సీన్స్ మాత్రం మిగిలి ఉంటే వాటిని త్వరలో పూర్తి చేసారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టనున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ కి జోడీగా అలనాటి నటి గౌతమి నటిస్తోంది.
‘దృశ్యం’ సినిమా ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తమిళంలో కూడా మంచి విజయం సాధిస్తుందని కమల్ ఆశిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

