ప్రత్యేకం : టాలీవుడ్ స్టార్స్ ‘వీ లవ్ వైజాగ్’ వేడుక విశేషాలు

ప్రత్యేకం : టాలీవుడ్ స్టార్స్ ‘వీ లవ్ వైజాగ్’ వేడుక విశేషాలు

Published on Oct 27, 2014 5:38 PM IST

TFI
ఇటీవలే సంభవించిన హుదూద్ తుఫాన్ వల్ల వైజాగ్ మరియు ఉత్తరాంధ్రని బాగా దెబ్బతింది. వారికి మేమున్నాం అంటూ సాయం చెయ్యడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కదిలి ఓ కార్యక్రమం చేయడానికి నిర్ణయించారని ఈ రోజు ఉదయం తెలియజేశాం. ప్రత్యేకంగా ఆ విశేషాలు మీకందిస్తున్నాం..

టాలీవుడ్ పరిశ్రమలోని అందరూ హాజరు కానున్న ఈ వేడుకకి ‘వీ లవ్ వైజాగ్’ అనే పేరుని పెట్టారు. ఈ వేడుక నవంబర్ 9వ తేదీన అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరగనుంది. ఇదొక టెలీథాన్ ప్రోగ్రాం.. టెలీథాన్ అని ఎందుకు అన్నాను అంటే ఈ వేడుక ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకూ కొనసాగుతుంది. ఈ 13 గంటలు ఈ ప్రోగ్రాం టీవీ లో లైవ్ వస్తుంది. ఈ వేడుకకి ఇండస్ట్రీ లోని చిన్న పెద్దా, హీరో – డైరెక్టర్ అని తేడా లేకుండా అందరూ హాజరు కానున్నారు. మీ అభిమాన ఆహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన అందరు హీరోలు హాజరు కానున్నారు.

అందులో పలువురు హీరోలు లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వనున్నారు. ఈ వేడుక నవంబర్ 9న హైదరబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి నిర్వహించనున్న ‘వీ లవ్ వైజాగ్’ వేడుక గురించిన మరిన్ని ప్రత్యేకమైన విశేషాలు ఎప్పటికప్పుడు మీకందజేస్తూనే ఉంటాం. దానికోసం కంటిన్యూ గా123telugu.com ని విజిట్ చేస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు