‘మేము సైతం’గా మారిన టాలీవుడ్ స్టార్స్ ‘వీ లవ్ వైజాగ్’

‘మేము సైతం’గా మారిన టాలీవుడ్ స్టార్స్ ‘వీ లవ్ వైజాగ్’

Published on Oct 29, 2014 11:09 AM IST

Tollywood
హుదూద్ బాధితులను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు వచ్చి ‘వీ లవ్ వైజాగ్’ అనే వేడుకని నిర్వహించనున్నారని ఇది వరకే తెలియజేశాం. కానీ ఫైనల్ గా జరిగిన చర్చల్లో ఈ ప్రోగ్రాంకి ముందుగా పెట్టిన ‘వీ లవ్ వైజాగ్’ అనే టైటిల్ ని మార్చారు. ఫైనల్ గా ఈ వేడుకకి ‘మేము సైతం’ అనే పేరు పెట్టి, దానికి ట్యాగ్ లైన్ గా ‘వీ లవ్ వైజాగ్’ అని పెట్టారు.

సుమారు 13 గంటల పాటు కంటిన్యూగా జరిగే ఈ లైవ్ ప్రోగ్రాం నవంబర్ 9న జరగనుంది.టాలీవుడ్ లోని అందరు స్టార్స్ హాజరు కావడమే కాకుండా, వారు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు హీరోలు అంతా కొన్ని టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆ రోజు ప్రోగ్రామ్స్ చేయనున్నారు. ప్ర

స్తుతం వాటికి సంబందించిన కొన్ని చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఆ విశేషాలు రాగానే ఏయే డైరెక్టర్స్, ఏయే హీరోస్ టీమ్స్ గా ఏర్పడ్డారు, వారు ఏమేమి చేయనున్నారు అనే విశేషాలను తెలియజేస్తాం. ఈ వేడుకకి తెలుగు హీరోలే కాకుండా తమిళ హీరోలైన సూర్య, కార్తీ కూడా హాజరై పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు