‘కత్తి’ రీమేక్ పై ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్..?

‘కత్తి’ రీమేక్ పై ఆసక్తి చూపని పవన్ కళ్యాణ్..?

Published on Oct 29, 2014 12:18 PM IST

pawan-kalyan
తమిళంలో ఘనవిజయం సాధించిన విజయ్ ‘కత్తి’ సినిమాను రీమేక్ చేయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. మంగళవారం నిర్మాత ఠాగూర్ మధుతో కలసి పవన్ ‘కత్తి’ సినిమాను చూస్తున్నట్టు 123తెలుగు.కామ్ ప్రేక్షకులకు తెలియజేసింది. సినిమా చూసిన తర్వాత పవన్ రీమేక్ కు నో చెప్పినట్టు సమాచారం.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. తమిళంలో ఈ సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

పవన్ రీమేక్ కు నో చెప్పడంతో డబ్బింగ్ వెర్షన్ ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డబ్బింగ్ రైట్స్ కూడా నిర్మాత ఠాగూర్ వద్దనే ఉన్నాయి. త్వరలో ఆడియో విడుదల చేసిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరింత సమాచారం కోసం 123తెలుగు.కామ్ ను విజిట్ చేస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు