‘లౌక్యం’ టీంతో బాలకృష్ణ వర్క్ చేయనున్నాడా.?

‘లౌక్యం’ టీంతో బాలకృష్ణ వర్క్ చేయనున్నాడా.?

Published on Nov 2, 2014 3:13 PM IST

Balayya-Rampachodavaram

తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ ప్రధముడని చెప్పవచ్చు. నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమా ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం బాలకృష్ణ సత్యదేవ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బాలకృష్ణ తన తదుపరి సినిమాకి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం.. బాలకృష్ణ లౌక్యం సినిమాకి పనిచేసిన కోన వెంకర్ – గోపి మోహన్ – శ్రీ వాస్ లతో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కొద్ది రోజులక్రితమే బాలకృష్ణ లౌక్యం సినిమా చూసి ఆ టీంని మెచ్చుకున్నారు. అప్పుడే బాలయ్య వారి దగ్గర మంచి కథ ఉంటే సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందులో భాగంగా ఆయనకి ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. అన్ని వర్కౌట్ అయితే బాలకృష్ణ – శ్రీ వాస్ – కోన వెంకట్ – గోపి మోహన్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుంది.

ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

తాజా వార్తలు