
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమంలో ప్రముఖ బాడ్మింటన్ స్టార్ పివి సింధు పాల్గొన్నారు. శనివారం సౌత్ సెంట్రల్ రైల్వే – సికింద్రాబాద్ డివిజన్ ప్రారంభించిన స్వచ్చ భారత్ యాత్రలో సింధు పాల్గొన్నారు. చీపురు పట్టి హైదరాబాద్ లో లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణను శుభ్రం చేశారు. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ‘స్వచ్చ భారత్’ కాంపెయిన్ లో పోల్గోనాల్సిందిగా ఛాలెంజ్ చేశారు.
‘నిజమైన దైవభక్తి పరిశుభ్రతలో ఉంది అని గాంధీజి చెప్పారు. మన దేశం పరిశుభ్రంగా ఉంచడానికి గాంధీజీ మాటలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తారని నేను ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్, జ్వాలా గుత్తా, లియాండర్ పేస్ లను ఈ ‘స్వచ్చ భారత్’లో కాంపెయిన్ లో పోల్గోనాల్సిందిగా నామినేట్ చేస్తున్నాను అని సింధు అన్నారు.

