
అటు రాజకీయాలను, ఇటు సినిమాలనూ నటసింహం బాలకృష్ణ ఏకతాటిపై నిర్విఘ్నంగా నడిపిస్తున్నాడు. ఎం.ఎల్.ఏ గా ప్రజల సమస్యలు వింటూనే సత్యదేవా దర్శకత్వంలో ప్రజల తరపున పోరాడే హీరోగా అలరించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అరకులోయ పరిసర ప్రాంతాలలో జరుపుకుంటుంది. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరొక వారంరోజులు అక్కడే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తుంది
ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లెజెండ్ ఇచ్చిన విజయంతో మంచి ఊపు మీదున్న బాలయ్య అభిమానులు మరొకసారి అటువంటి చిత్రమే ఆశిస్తున్నారు. మణిశర్మ అందిస్తున్న సంగీతం ప్రధాన ఆకర్షణ కానుందని సమాచారం

