క్రిస్మస్/సంక్రాంతి కానుకగా రానున్న శంకర్ ‘ఐ’

క్రిస్మస్/సంక్రాంతి కానుకగా రానున్న శంకర్ ‘ఐ’

Published on Nov 5, 2014 9:53 AM IST

i
ఓ మెసేజ్ ని కమర్షియల్ గా చెప్పడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ శంకర్ తన్న కెరీర్లో మొదటిసారి ట్రై చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రొడక్షన్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుండడం వలన ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతూ వస్తోంది. దీపావళి రిలీజ్ నుంచి వాయిదా వేసిన ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికీ కచ్చితమైన సమాచారం లేదు.

తాజాగా ఈ చిత్ర టీం నుంచి తెలిసిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు 5 లేదా 6 వారాల సమయం తీసుకునే అవకాసహం ఉంది. దాంతో ఈ చిత్ర టీం అన్ని పనులు డిసెంబర్ సగానికల్లా అయిపోతే క్రిస్మస్ కానుకగా అనగా డిసెంబర్ 25న రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. ఒకవేళ ఆ టైంకి అవ్వకపోతే 2015 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి పళన చేస్తున్నారు.

విజువల్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ కూడా ప్రస్తుతం రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా ‘ఐ’ పేరుతోనే రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.

తాజా వార్తలు