ఈ వారంలో రానున్న ‘అవును 2’ ఫస్ట్ లుక్ & ట్రైలర్

ఈ వారంలో రానున్న ‘అవును 2’ ఫస్ట్ లుక్ & ట్రైలర్

Published on Nov 5, 2014 6:18 PM IST

ravi-babu-harshavardan
హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు డైరెక్ట్ చేసినచిత్రం ‘అవును’. 2012లో విడుదలైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న ‘అవును 2’ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దాంతో ఈ చిత్ర టీం ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి సిద్దమైంది. అది కూడా ఈ వారంలోనే అవును 2 ఫస్ట్ లుక్ మరియు థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం తెలిపింది.

మామూలుగా రవిబాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత తక్కువటైం లోనే సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమాకి కూడా అదే రూటు ఫాలో అవుతూ నవంబర్ చివర్లో రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ‘అవును 2’లో హర్షవర్ధన్ రాణే, పూర్ణలతో పాటు సంజన, నికిత ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

తాజా వార్తలు