బంపర్ ఆఫర్ : స్టార్స్ తో డిన్నర్ చేసే లక్కీ చాన్స్.!

బంపర్ ఆఫర్ : స్టార్స్ తో డిన్నర్ చేసే లక్కీ చాన్స్.!

Published on Nov 7, 2014 2:05 AM IST

mimu-sitham
ప్రతి ఒక్కరికీ కుదిరితే తమ అభిమాన నటీ నటులతో కలిసి ఫోటో దిగాలని, కలిసి కొంత సమయం గడపాలని ఇంకా కుదిరితే కలిసి భోజనం చేయాలని ఉంటుంది. అలాంటి సదావకాశాన్నే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ మీకు అందిస్తోంది. కానీ ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. అలా అని స్టార్స్ ఏదో డబ్బుకోసం ఈ పని చేయడం లేదు.. హుదూద్ బాధితుల సహాయార్ధం ఇలా చేస్తున్నారు..

ఇప్పుడు అసలు విషయంలోకి వెళితే.. తెలుగు చిత్ర సీమ చేస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం(నవంబర్ 30) ముందు రోజు అనగా నవంబర్ 29వ తేదీన ఇండస్ట్రీలోని 50 నుంచి 60 మంది స్టార్స్ ఈ డిన్నర్ కి హాజరవుతారు. ఈ డిన్నర్ కి 250మంది కపుల్స్ కి ప్రవేశం ఉంటుంది. ప్రతి కపుల్ టికెట్ ధర లక్ష రూపాయలు. ఒక లక్ష రూపాయలు కట్టి ఈ డిన్నర్ కి టికెట్ తీసుకున్న వారు తమకు నచ్చిన స్టార్స్ తో కలిసి డిన్నర్ చేసే సదవకాశం దక్కుతుంది. ఈ వేడుక నవంబర్ 29న జె.ఆర్సి కన్వెన్షన్ హాల్ లో జరుగుతుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు, అలాగే డిన్నర్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ప్రోగ్రామ్స్ గురించి అతి త్వరలోనే తెలియజేస్తాం.

మీలో ఎవరైనా లక్ష రూపాయలు కట్టి టికెట్స్ తీసుకోకలిగే స్తోమత ఉంటే, మా ద్వారా మీకు టికెట్స్ ఇప్పించగలము. ఆసక్తి ఉన్నవారు మీ వివరాలను 123telugucontact@gmail.com కి మీ వివరాలను పంపించండి.

తాజా వార్తలు