
మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో పినాకిని ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ‘ఛేజ్’. ‘యు ఆర్ నెక్స్ట్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు బ్రాడ్ లీఫ్ ప్రొడక్షన్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంది. రామ్, స్పందన అల్లూరి జంటగా నటించారు. శంకర్ తమరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా నీలకంఠ, వీరశంకర్, డి.ఎస్.రావు, టి.ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారయణ తదితతులు హాజరయ్యారు.
బిగ్ సిడిలను నీలకంఠ, వీరశంకర్ సంయుక్తంగా ఆవిష్కరించగా, ఆడియో సిడిలను టి.ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారయణలు ఆవిష్కరించారు. తొలి సిడిని డి.ఎస్.రావు అందుకున్నారు.
అనంతరం దర్శకనిర్మాత మోహన్ నిమ్మకాయల మాట్లాడుతూ.. 2008లో ‘సంటైమ్స్ ఇన్ లైఫ్’ అనే ఇంగ్లీష్ సినిమా చేశాను. ఆ సినిమాకు ప్రసంశలు లభించాయి. ‘ఛేజ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. సినిమా షూటింగ్ పూర్తయింది. అంతా విదేశాలలోనే చిత్రికరించాం. ఫారిన్ టెక్నీషియన్లు వర్క్ చేశారు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శంకర్ తమరి మంచి సంగీతం అందించారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

