
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ పూణేలో జరుగుతుందని 123తెలుగు.కామ్ ప్రేక్షకులకు గతంలో తెలియజేశాం. ఈ నెల 9న ప్రారంభమైన ఈ షెడ్యూల్ నేటితో ముగిసింది. యూనిట్ మొత్తం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.
మహేష్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.

