ఆ కామెంట్స్ తో వివాదంలో ఇరుక్కున్న శ్రీలీల..?

ఆ కామెంట్స్ తో వివాదంలో ఇరుక్కున్న శ్రీలీల..?

Published on Apr 9, 2026 6:30 PM IST

Sreeleela

యంగ్ బ్యూటీ శ్రీలీల చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముంబయి భామ ఆయేషా ఖాన్ తాను పీరియడ్స్ సమయంలో ఐటెం సాంగ్ చేశానని చెప్పిన దానికి కౌంటర్‌గా శ్రీలీల స్పందించినట్లు కనిపిస్తోంది. సినిమాల్లో నటించే మహిళలకు పీరియడ్స్ అనేది ఒక సాకు కాదని, తాను కూడా ఎన్నో సార్లు ఆ ఇబ్బందుల్లోనే డ్యాన్స్ చేశానని ఆమె పేర్కొంది.

​అయితే, ఒక డాక్టర్ అయ్యుండి, ఒక మహిళగా పీరియడ్స్ సమయంలో ఉండే శారీరక ఇబ్బందులను “సాకు” గా అభివర్ణించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రతి మహిళ శరీరం ఒకేలా స్పందించదని, అలాంటి సమయంలో విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివాదాలకు దూరంగా ఉండే శ్రీలీల తొలిసారి ఇలాంటి కామెంట్స్‌తో వార్తల్లో నిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు