
సౌత్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో సమంత ముందుంటుంది. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇటీవలే కత్తి సినిమాతో తమిళంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమాలతో పాటు పలు విషయాల్లో ఆసక్తి చూపే సమంతకి తాజాగా గుర్రపు స్వారీ నేర్చుకోవాలనిపించింది. అనుకున్నదే తడువుగా ట్రైనింగ్ కూడా మొదలు పెట్టేసింది.
ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈ భామ నిన్నటి నుంచి హార్స్ రైడింగ్ నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత తెలియజేసింది. ‘హార్స్ రైడింగ్.. ఇప్పుడే క్లాసెస్ తీసుకోవడం మొదలు పెట్టాను. త్వరలోనే ఈ హార్స్ రైడింగ్ పై ప్రేమలో పడతానేమో అని’ ట్వీట్ చేసింది. ప్రస్తుతం తన ఆసక్తి కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమంతకి తన హార్స్ రైడింగ్ స్కిల్స్ ని రానున్న సినిమాల్లో ఉపయోగించే అవకాశం వస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం సమంత తెలుగులో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా తమిళంలో విక్రమ్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలో 2015లో రిలీజ్ కానున్నాయి.

