మహేష్, సూర్య, రవితేజలతో నటించాలని ఉంది- సోనాక్షి సిన్హా

మహేష్, సూర్య, రవితేజలతో నటించాలని ఉంది- సోనాక్షి సిన్హా

Published on Nov 17, 2014 1:26 PM IST

sonakshi-sinha
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ల స్టార్డం రావడం అనేది సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. అలా బ్లాక్ బస్టర్ ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఆ తర్వాత దాదాపు తను చేసిన అన్ని సినిమాలు 100 కోట్ల మార్క్ దాటేయడంతో బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న సోనాక్షి మొదటి సారి సౌత్ ఇండియాలో చేసిన సినిమా ‘లింగ’. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12నరిలీజ్ కానుంది.

నిన్ననే ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదు, అలాగే రజినీ కాకుండా మీకు ఏ సౌత్ హీరోతో నటించాలని ఉంది అని అడిగితే ‘ నా కాల్షీట్స్ సర్దుబాటు కాక సౌత్ సినిమాలు ఒప్పుకోలేదు. కానీ ఒక్కడు, విక్రమార్కుడు, తుపాకీ లాంటి సినిమాల రీమేక్ లో నేనే నటించాను. ఇకపోతే రజినీకాంత్ కాకుండా మహేష్ బాబు, సూర్య, రవితేజలతో కలిసి నటించాలనుకుంటున్నానని’ సోనాక్షి తెలిపింది. మరి త్వరలోనే కాల్షీట్స్ ఖాళీ చేసుకొని సౌత్ లో సినిమాలు చేస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు