
ఈ మధ్యకాలంలో ఇండియాలో స్టార్ సెలబ్రిటీల జీవిత గాధలపై సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సిల్క్ స్మిత బయోగ్రఫీ పై చేసిన సినిమా పెద్ద హిట్ అయ్యింది. తాజాగా ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మీర్జా రియల్ లైఫ్ మీద కూడా సినిమా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ సానియా మీర్జా లైఫ్ పై సినిమా తియ్యాలని ట్రై చేసారు. వారికి సానియా మీర్జా సమాధానం ఇస్తూ ‘నా పర్సనల్ లైఫ్ లోని విషయాలను షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నా లైఫ్ పై సినిమా తీయడంపై నాకు పెద్ద ఆసక్తి లేదని’ తెలిపింది.
అలాగే మాట్లాడుతూ ‘ఒకవేళ భవిష్యత్తులో నేను తీసుకున్న ఈ విషయంలో మార్పు ఉండొచ్చు. నా పరంగా సిల్వర్ స్క్రీన్ పై నా పాత్ర చేయడానికి దీపిక పడుకొనే బాగుంటుందని’ సానియా మీర్జా చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే సానియా మీర్జా జీవితంపై తీసే సినిమా ముందు ముందు వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే తన 28వ బర్త్ డే జరుపుకున్న సానియా మీర్జా ప్రస్తుతం తన అటో బయోగ్రఫీ రాస్తోంది. ఆ బుక్ కి ‘అగైనెస్ట్ ఆల్ ఆడ్స్’ నే పేరు పెట్టింది.

