ప్రత్యేకం : ‘మేము సైతం’ కోసం కబడ్డీ ఆడనున్న మంచు ఫ్యామిలీ

ప్రత్యేకం : ‘మేము సైతం’ కోసం కబడ్డీ ఆడనున్న మంచు ఫ్యామిలీ

Published on Nov 19, 2014 5:01 PM IST

mimu-sitham
హుదూద్ బాధితుల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహించనున్న ‘మేముసైతం’ ప్రోగ్రాం కోసం ప్రతి ఒక్క హీరో, అతని ఫ్యామిలీ స్వతహాగా ముందుకు వచ్చి పలు కార్యక్రమాలను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోస్ తమకు తెలిసిన ఆటలు ఆడటానికి మరియు ప్రోగ్రామ్స్ చెయ్యడానికి సిద్దమయ్యారు. వీరి జాబితాలో డా. ఎం. మోహన్ బాబు ఫ్యామిలీ కూడా వచ్చి చేరింది.

మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం మంచు ఫ్యామిలీ అంతా కలిసి కబడ్డీ ఆడనున్నారు. ఈ కబడ్డీ జట్టులో కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా ఉంటారని సమాచారం. ప్రస్తుతానికి ఎవరెవరు టీమ్స్ గా విడిపోయి, ఆడనున్నారు అనే విషయాలను త్వరలోనే మీకు తెలియజేస్తాం. ఇలా మంచు ఫ్యామిలీకి చెందినా వారంతా కలిసి కబడ్డీ మ్యాచ్ ఆది దాని ద్వారా వచ్చే ప్రైజ్ మనీని మేముసైతం ప్రోగ్రాం ద్వారా కలెక్ట్ చేస్తున్న సిఎం ఫండ్ కి డొనేట్ చేయనున్నారు.

మేము సైతం గురించిన ప్రత్యేక అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మా 123telugu.com ని విజిట్ చేస్తూ ఉండండి..

తాజా వార్తలు