
సౌత్ ఇండియన్ లో ఒకరైన అందాల భామ కాజల్ అగర్వాల్ పలు సినిమాల్లో తన అందచందాలతో ఆన్ స్క్రీన్ హాట్ హాట్ గా కనిపించి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నిటికన్నా ఇప్పుడు కాస్త డోస్ పెంచనుంది కాజల్. అది కూడా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘టెంపర్’ సినిమా కోసం..
మాకు అందిన సమాచారం ప్రకారం కాజల్ తన గత సినిమాల కంటే ఎక్కువ గ్లామరస్ గా కనిపించబోతోంది. అలాగే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం కాజల్ అగర్వాల్ కొన్ని బోల్డ్ కాస్ట్యూమ్స్ ని కూడా ట్రై చేసింది. తన గ్లామరస్ కాస్ట్యూమ్స్ మరియు అందాల ఆరబోత ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలనుకుంటున్న ఈ సినిమాని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

