
‘గబ్బర్ సింగ్ 2’ సినిమాకోసం పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపించానున్నాడా? అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. డ్రెస్సింగ్ విషయంలో స్టైలింగ్ విషయంలో పలు మార్పులతో మన ముందుకు రానున్నట్లు తెలుస్తుంది
కొత్త కొత్త స్టైల్లను తెరపైన చూపించడానికి పవన్ ఎప్పుడూ ముందుంటాడు. బాలు ప్యాంట్, ఖుషి బ్యాగ్ అంటూ యువతలో భయంకరమైన క్రేజ్ ని, ఫాలోయింగ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి అదే తరహా స్టైల్ ని మనముందుకు తీసుకురానున్నాడు
ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించనున్నాడు. శరత్ మరార్ నిర్మాత. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్

