రాజ్యం కోసం ఆజానుబాహుల్లాంటి ఇద్దరు అన్నదమ్ములు తలపడితే… శత్రు సైన్యంపై పోరాడాల్సిన తమ్ముడు అన్నపై యుద్దానికి దిగితే.. భయంకర పోరాటమే. ప్రస్తుతం అటువంటి పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. చారిత్రాత్మక కథతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అతని సోదరుడు ‘భళ్ళాల దేవుడు’ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు కొనసాగుతుంది.
అనుష్క, తమన్నా కధానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేష్ ఇతర పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. తమిళంలో ‘మహాబలి’గా ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు.


